రాజకీయాలు, సినిమాలతో నిత్యం బిజీగా ఉండే జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ సాగరతీరంలో కాసేపు సరదాగా గడిపారు. పార్టీ నేతలతో కలిసి కాపులప్పాడ బీచ్‌ను సందర్శించిన ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విశాఖ రిషికొండ ప్రాంతాన్ని పరిశీలించారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ తదితరులు పవన్ వెంట ఉన్నారు.