హింసాత్మక రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్ సర్కార్ పై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసిన పవన్ కల్యాణ్

దాదాపు 8 సంవత్సరాల తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా విశాఖకు చేరుకున్న ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత రాజకీయంపై పవన్ ప్రధానికి కంప్లైట్ చేశారు.అలాగే రిషికొండలో తవ్వకాల గురించి కూడా చర్చించారు. వీటితో పాటు ఏపీలోని ఆలయాలపై జరుగుతున్న దాడులను కూడా ప్రధానికి వివరించారు. కేంద్రం నిధులు ఇచ్చినా.. ప్రభుత్వం సరిగ్గా ఖర్చు చేయడం లేదని పవన్ ఫిర్యాదు చేశారు. ఆర్థిక క్రమశిక్షణ సరిగ్గా లేదని, హింసాత్మక దాడులకు కూడా దిగుతున్నారని పవన్ మోదీకి ఫిర్యాదు చేశారు.

 

మోదీతో సమావేశం ముగిసిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ మీడియాతో మాట్లాడారు. మొదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర భవిష్యత్తుకు మంచి చేస్తుందన్నారు. చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమావేశం జరిగిందన్నారు. ఏపీలో జరుగుతున్న విషయాలన్నీ తనకు తెలుసని మోదీ వ్యాఖ్యానించారని, తనకు అవగాహన వున్న అంశాలన్నీ మోదీకి వివరించానని పవన్ వెల్లడించారు. 8 సంవత్సరాల తర్వాత మోదీని కలిశానని, ఎప్పుడో 2014 లో ప్రధానిగా ప్రమాణం చేసే ముందు కలిశానని పవన్ గుర్తు చేసుకున్నారు.

Related Posts

Latest News Updates