జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా కూలిపోతుందని విరుచుకుపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు కోసం అక్రమంగా ఇళ్లను కూల్చివేయడంపై విరుచుకుపడ్డారు. వైసీపీకి అనుకూలంగా ఓటు వేసిన వారే తమ వారని ప్రభుత్వం భావిస్తోందని ఫైర్ అయ్యారు. ఓటు వేయని వారిని తొక్కి నార తీయండి అనే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటం గ్రామంలో గతంలో తాము నిర్వహించిన సభకు భూమి ఇచ్చినందుకు ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆ సభ తర్వాతే రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వం కక్ష సాధిస్తోందని అన్నారు. వాళ్లకు ఓటేసిన 49.95 శాతం మందికే తమ ప్రభుత్వం వుందనే విధంగ వైసీపీ పాలన కొనసాగుతోందని పవన్ విమర్శించారు.
కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంది – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/nuuTYYpqje
— JanaSena Party (@JanaSenaParty) November 4, 2022












