ఆర్ఆర్ఆర్ మూవీ రాజమౌళికి ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చి పెట్టిన విషయం తెలిసిందే. ఈ మధ్యే ప్రపంచ స్థాయి అవార్డును కూడా నాటు నాటు పాటకు అందుకున్నారు. అయితే… తాజాగా దర్శక ధీరుడు రాజమౌళికి హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. . భవిష్యత్తులో రాజమౌళి హాలీవుడ్ లో మూవీ చేయాలనుకుంటే తనను సంప్రదించాలని సూచించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను RRR టీమ్ పంచుకుంది. అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో జేమ్స్ కామెరూన్ రాజమౌళి కలుసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా గురించే చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని కూడా కెమెరూన్ పేర్కొన్నారు. దీంతో రాజమౌళి అమితానందం పొందారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఈ మొత్తం సంభాషణకు… జేమ్స్ కామెరూన్ ఆఫర్ కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను RRR టీమ్ రిలీజ్ చేసింది.
https://twitter.com/RRRMovie/status/1616674510920650752?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1616674510920650752%7Ctwgr%5E2f4042b6484f08a51e9c89ba96c07afdf410a1b9%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-6725726333254185120.ampproject.net%2F2301041800000%2Fframe.html













