ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై జగిత్యాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి సహకరించమని తేల్చి చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ గురువారం జగిత్యాల అష్టదిగ్బంధనం అన్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు రైతులు. అఖిలపక్షం ఆధ్వర్యంలో అంబారీపేట, హుస్నాబాద్, తిమ్మాపూర్, మోతే గ్రామస్థులు, రైతులు రోడ్లపై ధర్నాకి దిగారు. మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ… రోడ్డుపైనే వంటావార్పుకి దిగారు. ఈ అష్టదిగ్బంధనానికి రాజకీయ పక్షాలు కూడా మద్దతిచ్చాయి. రైతులు, ప్రజలు ఈ నిరసన చేపడుతుండటంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతుల డిమాండ్ మేరకు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.