విజయ్ ఆంటోనీ “తుఫాన్”మూవీ నుండి ‘ఇతడెవరు’ లిరికల్ సాంగ్ రిలీజ్

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్”. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్  లో “తుఫాన్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. “తుఫాన్” సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ‘ఇతడెవరు’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

‘ఇతడెవరు’ లిరికల్ సాంగ్ ను విజయ్ ఆంటోనీ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా భాష్యశ్రీ గుర్తుండిపోయే సాహిత్యాన్ని అందించారు. సంతోష్ హరిహరన్ ఆకట్టుకునేలా పాడారు. ‘ఇతడెవరు ఇతడెవరు తెలియని ఓ చరితో, లోతైన ఓ కడలో ..తను గాథో ఎద బాధో..తను ఉరుమో లేక పిడుగో..’ అంటూ కథానాయకుడి ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో పవర్ ఫుల్ గా సాగుతుందీ పాట. ‘ఇతడెవరు’ లిరికల్ సాంగ్ ను థియేటర్స్ లో ప్రేక్షకులు ఎంజాయ్ చేయబోతున్నారు.

Related Posts

Latest News Updates