ఏపీలో ఐటీ రైడ్స్… వైసీపీ యువ నేత దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ సోదాలు

ఏపీలో మళ్లీ ఐటీ రైడ్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా వైసీపీ యువనేత, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ ఛార్జీ దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నేటి ఉదయం 6:30 నిమిషాల నుంచి ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 5 బృందాలుగా అధికారులు విడిపోయి. ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, నెల్లూరులోనూ ఈ సంస్థకు చెందిన డైరెక్టర్లు, పెట్టుబడిదారుల కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఇలా ఏపీలో మొత్తం 15 చోట్ల ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐటీ రైడ్స్ జరిగాయి.

Related Posts

Latest News Updates