నేటి నుంచి ఉదయం నుంచి మంత్రి మల్లారెడ్డి నివాసాలు, తన బంధువుల నివాసాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తూనే వుంది. ఇందులో భాగంగా మల్లారెడ్డి నివాసంతో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కుమారుడు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి ఇళ్లల్లోనూ ఐటీ దాడులు చేసింది. మంత్రి వియ్యంకుల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
అయితే… మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో ఐటీ తనిఖీలు చేసింది. 2 కోట్ల నగదును ఐటీ సీజ్ చేసింది. త్రిశూల్ రెడ్డి కూడా పలు కాలేజీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తెల్లవారుజాము నుంచే 50 టీములుగా విడిపోయిన ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లు తనిఖీలు కంటిన్యూ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ టీమ్స్ ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.