తెలంగాణలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆయన ఇంట్లో ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ వ్యాపారంతో ఎంపీ రవిచంద్రకు మంచి సంబంధాలున్నాయి. ఈ కారణంగానే ఈడీ సోదాలు చేస్తోంది.
బుధవారమే ఈడీ, ఐటీ అధికారులు మంత్రి గంగుల కమలాకర్ నివాసంతో పాటు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లల్లో ఈడీ, ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లోని గ్రానైట్ వ్యాపారుల ఇళ్లల్లో, అలాగే కరీంనగర్ లోని మంత్రి గంగుల నివాసంతో పాటు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లపై సోదాలు నిర్వహించారు.