తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఐటీ అధికారులు ఝలక్ ఇచ్చారు. నేటి ఉదయం నుంచే ఆయన నివాసాలు, కార్యాలయాలతో పాటు ఆయన అల్లుళ్లు, కుమారుడు ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 50 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక… మల్లారెడ్డికి చెందిన కాలేజీల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.