‘టైగర్ నాగేశ్వరరావు’ లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తో పరిచయం కావడం చాలా ఆనందంగా వుంది: హీరోయిన్ నూపుర్ సనన్

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, మ్యాసివ్ ట్రైలర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నూపుర్ సనన్ విలేకరుల సమావేశంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విశేషాలని పంచుకున్నారు.

‘టైగర్ నాగేశ్వరరావు’లో మీ పాత్ర గురించి చెప్పండి ?
‘టైగర్ నాగేశ్వరరావు’ లో నా పాత్ర పేరు సార. తను మార్వాడీ అమ్మాయి. తనది సోల్ ఫుల్ క్యారెక్టర్. తను ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం ఏదైనా చేసే అమ్మాయి. ఇది నా మొదటి సినిమా. నా పాత్ర కమర్షియల్ గా ఉంటూనే పెర్ఫార్మెన్స్ కూడా స్కోప్ ఉన్న రోల్ ఇది. మొదటి సినిమాకే ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర దొరకడం ఆనందంగా వుంది.

ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.. ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
మొదటిది.. మాస్ మహారాజా రవితేజ గారు. ఆయన సినిమాలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. రెండోది.. అభిషేక్ అగర్వాల్ ప్రొడక్షన్. ఇప్పటికే కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2 లాంటి పాన్ ఇండియా విజయాలు ఇచ్చారు. ఇది నాకు మంచి లాంచింగ్ ప్రాజెక్ట్ అవుతుందని భావించాను. అలాగే దర్శకుడు వంశీ గారు. ఈ పాత్ర కోసం దాదాపు 200 మందిని ఆడిషన్స్ చేశారని తెలిసింది. ఈ పాత్రకు నేను యాప్ట్ గా వుంటానని ఆయన బిలీవ్ చేయడం నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది.

 

ఇది పీరియడ్ సినిమా కదా.. ఈ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు ?
దర్శకుడు వంశీ గారు ఈ కథపై దాదాపు మూడేళ్ళు రీసెర్చ్ చేశారు. ఏ పాత్ర ఎలా ఉండాలో ఆయనకి చాలా క్లారిటీ వుంది. హీరోయిన్ హెయిర్ బ్యాండ్ ఎలా ఉండాలో కూడా క్లియర్ గా రాసుకున్నారు. ఆయన చెప్పినట్లుగా నటించాను.

రవితేజ గారి సినిమాలు చూశారా ? ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
దాదాపు అన్నీ సినిమాలు చూశాను. రవితేజ గారు ఒరిజినల్ విక్రమ్ రాథోడ్. రవితేజ యాక్టింగ్ అమేజింగ్. ఆయన కామిక్ టైమింగ్ అద్భుతంగా వుంటుంది. మాస్ మహారాజా టైటిల్ రవితేజ గారికి యాప్ట్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన హిందీ చాలా అద్భుతంగా వుంటుంది. షూటింగ్ లో చాలా సపోర్ట్ చేశారు. ఆయన వలన లాగ్వెంజ్ బారియర్ తొలిగిపోయింది.

కృతిసనన్ నుంచి ఎలాంటి సలహాలు తీసుకున్నారు ?
తన జర్నీ కూడా తెలుగు నుంచి ప్రారంభమైయింది. మా ఇద్దరి అభిరుచులు వేరుగా ఉంటాయి. తను నాకు ఇచ్చిన ఒకే ఒక సలహా.. ”నువ్వు నీలా వుండు’ అని చెప్పింది. నేను కూడా అదే ఫాలో అవుతాను.

సౌత్ సినీ పరిశ్రమ ఎలా అనిపించింది ?
సౌత్ ఇండస్ట్రీ చాలా ఆర్గనైజ్ గా వుంటుందని విన్నాను. ఈ సినిమాతో ప్రత్యక్షంగా చూశాను. చాలా గౌరవంగా మర్యాదగా చూసుకున్నారు. చాలా సపోర్ట్ చేశారు. అలాగే టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ వుంటారు ఇక్కడ. మధి గారు, జీవి ప్రకాష్ గారు బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు.

మీకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు ?
సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఫిదా చూసి ఫిదా అయిపోయాను. అలాగే అనుష్క శెట్టి, కీర్తి సురేష్ అంటే కూడా ఇష్టం.

టాలీవుడ్ లో ఇష్టమైన హీరోలు ?
నాని గారు అంటే ఇష్టం. అలాగే రామ్ పోతినేని, విశ్వక్ సేన్ కూడా ఇష్టం.

భవిష్యత్ లో ఎలాంటి పాత్రలు చేయాలని వుంది ?
అన్ని రకాల పాత్రలు చేయాలని వుంది. అలాగే ఒక బలమైన ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా చేయాలని వుంది. ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధికి తో ఓ సినిమా చేస్తున్నాను.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

Related Posts

Latest News Updates