రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇకపై పదవిలో కొనసాగబోరనే వార్తలు వినపడుతున్నాయి. . ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. క్రమంగా అతని ఆరోగ్యం దిగజారిందని, యుద్ధ ఒత్తిడి కారణంగా పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందని అధ్యక్ష కార్యాలయ అధికారులు, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నట్లు కథనాలు వెలవడ్డాయి. పుతిన్ పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని కుటుంబం నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగింది. ఇటీవల క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ దియాజ్- కానెల్ వై బెర్మెడెజ్‌తో భేటీ అయిన సందర్భంగా పుతిన్ చాలా అసౌకర్యంగా కూర్చున్నట్లు, ఫుతిన్ చేయి గులాబీ రంగులో ఉన్నట్లు ఫొటోలు ప్రచురితమయ్యాయి. పుతిన్‌కు పార్కిన్సన్ ఉండొచ్చని, ఇటీవల ఆయనలో ఆ వ్యాధి లక్షణాలు కనిపించాయని సోలోవీ పేర్కొన్నారు. (పుతిన్ కాళ్లు వణకటం, పెన్ను పట్టి సరిగా రాయలేకపోవడం ఇటీవలి వీడియోల్లో కనిపించాయి). ఈ వార్తలను రష్యా ఖండించింది. పుతిన్ ఆరోగ్యంగానే ఉన్నారని రష్యా ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.












