ఐపీఎల్ సీజన్ షురూ అయ్యింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. అయితే.. మొదటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. 179 లక్ష్య సాధనతో బరిలోకి దిగిన గుజరాత్ ఆటగాళ్లు రావడం రావడమే దూకుడుతో ఆడారు. 25 పరుగులు చేసిన సాహా.. రాజవర్ధన్ బౌలింగ్ లో అవుటవడంతో మొదటి వికెట్ పడింది. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ గెలిచింది. దీంతో ఐపీఎల్ బోణీ కొట్టినట్టైంది. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. గిల్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 63) అర్ధసెంచరీ సాధించగా, మిగతా బ్యాటర్లు కూడా వేగంగా పరుగులు సాధించారు. అటు చెన్నై ఇన్నింగ్స్‌లో రుతురాజ్ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92) మినహా ఎవరూ రాణించకపోవడం దెబ్బతీసింది.
గుజరాత్ టైటాన్స్ నుంచి ఓపెనర్ సాహా (25) రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగి నాలుగో ఓవర్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత గిల్, సాయి సుదర్శన్ (22) భారీ షాట్లతో వేగంగా ఆడడడంతో పవర్‌ప్లేలోనే జట్టు 65 పరుగులు సాధించింది. రెండో వికెట్‌కు వీరు 53 పరుగులు జోడించారు. సాహా, సుదర్శన్‌ల వికెట్లను అరంగేట్ర యువ పేసర్ హంగర్గేకర్ తీశాడు. 11వ ఓవర్‌లో 4,6తో గిల్ 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు.అయితే 19వ ఓవర్‌లో రషీద్ (10 నాటౌట్) 6,4 బాదేయడంతో 15 పరుగులు రాగా.. ఆఖరి ఓవర్‌లో తెవాటియా (15 నాటౌట్) 6,4తో మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ గెలుచుకుంది.