IPL 2023 : బోణీ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్… బెంగళూరును ఓడించిన కోల్ కతా

ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బోణీ చేసేసింది. గురువారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 81 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)ను చిత్తుగా ఓడించింది. తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోరు చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్‌ (44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), రింకూ సింగ్‌ (33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) రాణించారు. డేవిడ్‌ విల్లే, కర్ణ్‌ శర్మ చెరో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. అనంతరం ఛేదనలో బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. డుప్లెసి (23), కోహ్లీ (21) టాప్‌ స్కోరర్లు. వరుణ్‌ చక్రవర్తి నాలుగు వికెట్లు పడగొట్టగా..అరంగేట్రం స్పిన్నర్‌ సుయాశ్‌ శర్మకు మూడు, నరైన్‌కు రెండు వికెట్లు లభించాయి.

అయితే… బెంగళూరు మొదట్లో ఆటను బాగానే ఆడినా… ఆర్సీబీ స్పిన్నర్ల దెబ్బకు తడబడింది. 61 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకొన్న చాలెంజర్స్‌ ఏదశలోనూ మ్యాచ్‌లోకి రాలేక పోయింది. ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసి జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చారు. సౌథీ వేసిన నాలుగో ఓవర్‌లో కోహ్లీ బౌండ్రీ కొట్టగా.. డుప్లెసి రెండు సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. అయితే, స్పిన్నర్లు నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి ఎంట్రీతో రాయల్‌ చాలెంజర్స్‌ జోరుకు కళ్లెం పడింది. రెండు పరుగుల తేడాతో కోహ్లీ, డుప్లెసిని కోల్పోయిన బెంగళూరు.. క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకొంటూ ఓటమి దిశగా సాగింది. కోహ్లీని నరైన్‌ బౌల్డ్‌ చేయగా.. డుప్లెసిని చక్రవర్తి పెవిలియన్‌ చేర్చడంతో పవర్‌ప్లే ముగిసే సరికి బెంగళూరు 50/2తో నిలిచింది.

శార్దూల్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో కోల్‌కతా అనూహ్యంగా భారీ స్కోరు చేసింది. బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడిన ఠాకూర్‌.. ఎడాపెడా షాట్లతో స్కోరు బోర్డును దౌడు తీయించాడు. రింకూతో కలసి ఠాకూర్‌ ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 103 పరుగులు జోడించడంతో నైట్‌రైడర్స్‌ రెండొందల మార్క్‌కు చేరింది. టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్‌ ఆరంభంలో తడబడింది. ఓపెనర్‌ వెంకటేష్‌ అయ్యర్‌ (3), మన్‌దీప (0)ను నాలుగో ఓవర్‌లో విల్లే వరుస బంతుల్లో అవుట్‌ చేసి షాకివ్వగా.. పవర్‌ప్లే ముగిసిన వెంటనే కెప్టెన్‌ నితీశ్‌ రాణా (1)ను బ్రేస్‌వెల్‌ క్యాచవుట్‌ చేయడంతో కోల్‌కతా 47/3తో కష్టాల్లో పడినట్టు కనిపించింది.

 

కానీ, మరో ఓపెనర్‌ గుర్బాజ్‌.. రింకూతో కలసి నాలుగో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశాడు. అయితే, 11వ ఓవర్‌లో గుర్బాజ్‌ను, అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన రస్సెల్‌ (0)ను కర్ణ్‌ శర్మ అవుట్‌ చేశాడు. ఈ దశలో రింకూకు శార్దూల్‌ జతకలవడంతో సీన్‌ మొత్తం మారిపోయింది. ఆకాష్‌ వేసిన 13వ ఓవర్‌లో శార్దూల్‌ రెండు ఫోర్లు, సిక్స్‌తో 19 పరుగులు రాబట్టడంతో.. నైట్‌రైడర్స్‌ 113/5తో నిలిచింది. ఆ తర్వాత 15వ ఓవర్లో వరుసగా మరో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఆ తర్వాత కూా రెండు ఫోర్లు బాదిన శార్దూల్‌.. కేవలం 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకొన్నాడు.

Related Posts

Latest News Updates