స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగా కన్నుమూత

స్వతంత్ర భారత తొలి ఓటరు, హిమాచల్ కి చెందిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగా కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… నేడు మరణించినట్లు కుటుంబీకులు ప్రకటించారు. 3 రోజుల క్రితమే రాబోయే శాసన సభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకన్నారు. పోస్టల్ బ్యాలెట్( postal ballot) పంపించిన సమయంలో 106 ఏళ్ల వృద్ధుడైన నేగి అనారోగ్యంతో ఉన్నారు. తొలి ఓటరు నేగి అంత్యక్రియలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని, ఆయనకు గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు బ్యాండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కిన్నౌర్ జిల్లా కలెక్టర్ అబిద్ హుస్సేన్ తెలిపారు.

 

 

1917వ సంవత్సరం జులై1 వతేదీన జన్మించిన శ్యామ్ శరణ్ నేగి భారతదేశపు మొదటి ఓటరుగా గుర్తింపు పొందారు. నేగి కల్పాలో పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1947వ సంవత్సరంలో బ్రిటీష్ పాలన ముగిసిన తర్వాత 1951వ సంవత్సరంలో భారతదేశం తన మొదటి సాధారణ ఎన్నికలను నిర్వహించినప్పుడు అక్టోబర్ 25వతేదీన ఓటు వేసిన మొదటి వ్యక్తి నేగి.

Related Posts

Latest News Updates