హైదరాబాద్ సాగర తీరం వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్ లో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ రేసింగ్ లో 12 కార్లు, 6 బ్యాచ్ లతో పాటు 50 శాతం దేశీయ రేసర్లు, మరో 50 శాతం విదేశీ రేసర్లు పాల్గొన్నారు.

ఈ పోటీలను వీక్షించేందుకు గాను ట్రాక్ మార్గంలో 7 గ్యాలరీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రేపు (ఆదివారం) కూడా ఈ పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం 3:20 వరకూ క్వాలిఫయింగ్ 1 రేసు, 3:30 నుంచి 3:40 వరకూ క్వాలిఫయింగ్ రేస్ 2 సాయంత్రం 4:00 నుంచి 4:45 వరకూ రేస్-1, 4:45 నుంచి 5:00 గంటల వరకూ ఇంటర్వ్యూలు జరుగుతాయి.