చైనాలో కరోనా కేసులు పెరగుతున్న నేపథ్యంలో భారత ప్రజలు అత్యంత జాగరూకతతో వుండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచించింది. కరోనా రూల్స్ కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేసింది.రాబోయే వైరస్ వ్యాప్తిని అధిగమించడానికి అవరసమైన చర్యలు తీసుకోవాలని కోరింది. పబ్లిక్ ప్లేసుల్లో మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, సబ్బు, శానిటైజర్‌లతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని సూచించింది. వీలైనంత తొందరగా అందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని ఐఎంఏ డాక్టర్లు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. పెండ్లిండ్లు, సమావేశాలు, సభలు, ఇంటర్నేషనల్ టూర్లకు దూరంగా ఉండాలని చెప్పారు. జ్వరం, గొంతునొప్పి, దగ్గు, లూజ్ మోషన్‌లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని కోరారు.












