సరిహద్దుల్లో మేమున్నాం… దీపావళి ఘనంగా చేసుకోండి… భారత జవాన్ల పిలుపు

దేశ సరిహద్దుల వద్ద భారత జవాన్లు దీపావళి, ధంతేరాస్ జరుపుకున్నారు. నియంత్రణ రేఖ వద్ద దీపాలు వెలిగించి, బాణాసంచా పేల్చుతూ.. వేడుకలు నిర్వహించారు. భారత జవాన్లు దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సరిహద్దుల వద్ద తాము అప్రమత్తంగానే వున్నామని, ఎలాంటి చీకు, చింతా లేకుండా ప్రజలందరూ దీపావళి పండుగ జరుపుకోవాలని జవాన్లు పిలుపునిచ్చారు. దేశ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవాలి. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. సరిహద్దుల్లో మేము అప్రమత్తంగానే వున్నాం. మాది భరోసా… అంటూ జవాన్లు పేర్కొన్నారు.

 

Related Posts

Latest News Updates