కల్కి రిలీజైనప్పుడు ఆ సినిమాకు ఉన్న హైప్ ను దృష్టిలో ఉంచుకుని దానికి పోటీగా ఇండియాలో మరో చెప్పుకోదగ్గ సినిమాను రిలీజ్ చేయలేదు. తెలుగులో అయితే కల్కి రిలీజ్ కు రెండు వారాల ముందు నుంచే సరైన సినిమాలు లేక బాక్సాఫీస్ డల్ గా నడిచింది. కల్కి రిలీజ్ తర్వాతి వారం కూడా తెలుగులో చెప్పుకోదగ్గ రిలీజ్ లేమీ లేవు. దీంతో రెండు వారాల పాటూ కల్కి ఎలాంటి సమస్యా లేకుండా రన్ అయింది. ఫస్ట్ వీకెండ్ తర్వాత కాస్త డల్ అయిన కల్కి, సెకండ్ వీకెండ్ లో కూడా అడుగుపెట్టింది. ఆ తర్వాత కాస్త జోరు తగ్గింది. ఈ లోగా ఇండియన్2 రిలీజైంది. దీంతో కల్కి రన్ క్లోజ్ అవుతుందనుకున్నారంతా. కానీ ఇండియన్2 కు డిజాస్టర్ టాక్ రావడంతో కల్కి కి మళ్లీ కలెక్షన్ల జోరు పెరిగింది.
తెలంగాణలో ఇండియన్2కు టికెట్ రేట్లు పెంచినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ డిజాస్టర్ టాక్ రావడంతో వీకెండ్ లోనే సినిమా కుప్ప కూలిపోయింది. ఇండియన్2 ప్లేస్ లోకి మళ్లీ కల్కి వచ్చింది. కల్కి టికెట్ రేట్లు కూడా తగ్గటంతో విజువల్ వండర్ గా పేరున్న కల్కిని థియేటర్లలో చూడాలని ఆడియన్స్ దానికే ఓటేశారు. మొత్తానికి ఇండియన్2 రిజల్ట్ కల్కికి వరంగా మారింది.