భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలోనే బలమైన ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ వెల్లడిరచింది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్రిటన్‌ను దాటేసి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్వవస్థగా భారత్ అవతరించిందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఐఎంఎఫ్ నుంచి సేకరించిన జీడీపీ గణాంకాల ప్రకారం, 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లుగా ఉండగా, యూకే ఆర్థిక వ్యవస్థ పరిమాణం కేవలం 816 బిలియన్ డాలర్లు అని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. మరోవైపు ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆ దేశ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది. రాబోయే రోజుల్లో బ్రిటన్ జీడీపీ మరింత పతనమయ్యే ప్రమాదం ఉందని బ్లూమ్‌బర్గ్ సూచించింది.