ప్రధాని నరేంద్ర మోదీపై అనాగరిక వ్యాఖ్యలు చేసిన పాక్… దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్

ఐరాస వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్తాన్ తప్పులను ఎత్తిచూపడంతో పాక్ కు ఏం చేయాలో పాలుపోక… ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగింది. ఇందులో భాగంగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రధాని మోదీని కసాయి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాది బిన్ లాడెన్ చనిపోయాడు కానీ… గుజరాత్ లోని కసాయి బ్రతికున్నాడని, అతను భారత ప్రధాని అంటూ అనాగరిక వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆరెస్సెస్ కే ప్రధాని అంటూ విమర్శించారు. నరేంద్ర మోదీకి అమెరికా అప్పట్లో వీసా నిరాకరించిందని, ప్రధాని అయిన తర్వాతే వీసా ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ సమస్య లేవనెత్తిన పాకిస్తాన్ కి భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఇస్లామిక్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు పాక్ ఆశ్రయం ఇచ్చిందని, అలాంటి దేశం మాట్లాడటమా? అంటూ ఏకిపారేశారు. అలాగే… భారత పార్లమెంట్ పై దాడికి దిగిన ఇస్లామిక్ ఉగ్రవాదులకు కూడా దాయాది పాక్ ఆశ్రయం ఇచ్చిందని, ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారు బోధలు ఎలా చేప్తారంటూ సూటిగా ప్రశ్నించారు. అలాగే విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా తీరుపై కూడా నిప్పులుగక్కారు. భారత ప్రయత్నాలకు చైనా ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ… పాక్ ను వెనకేసుకొస్తోందని దుయ్యబట్టారు. భద్రతా మండలి ఆంక్షల కమిటీలో చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి, ఇస్లామిక్ ఉగ్రవాది మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను కాపాడుతూ వస్తోందని మండిపడ్డారు.

Related Posts

Latest News Updates