సూడాన్ భారతీయుల తరలింపు కోసం ‘ఆపరేషన్ కావేరీ’ ప్రారంభం

సూడాన్ లో ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. క్షోభంలో ఉన్న సుడాన్‌లో సుమారు 4,000 మంది భారతీయులు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని సురక్షితంగా భారత్‌కు తరలించేందుకు ‘ఆపరేషన్ కావేరి’ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సుమారు 500 మంది భారతీయులు సుడాన్‌ పోర్ట్‌కు చేరుకున్నారు. మరింత మంది కూడా సూడాన్ పోర్టుకు చేరుకుంటారని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. భారత నౌకా దళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సుమేధ ఇప్పటికే సిద్ధంగా ఉందని అన్నారు. సుడాన్‌లో చిక్కుకున్న భారతీయులను ఐఎన్‌ఎస్‌ సుమేధ, ఐఏఎఫ్‌ విమానాల ద్వారా భారత్‌కు తరలించే ప్రక్రియ సోమవారం ప్రారంభమైందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

 

Related Posts

Latest News Updates