చైనా మరోసారి అధికార దాహాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తే… సరిహద్దుల్లోని భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు కూడా గాయపడ్డారు. అయితే.. చైనా సైనికులే అధిక సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. ఈ నెల 9 న చైనా సైనికులు తవాంగ్ సెక్టార్ ప్రాంతంలోని సున్నిత ప్రదేశంలోకి అడుపెట్టినట్లు తెలుస్తోంది. వారిని మన దేశ సైనికులు వారిని అడ్డుకున్నాయని, దీంతో ఘర్షణ తలెత్తిందని భారత సైన్యం పేర్కొంది. ఘర్షణ తర్వాత ఇరు దేశాల బలగాలు ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లాయని పేర్కొంది. అయితే… ఇది ఈ నెల 9 నే జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.












