దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా ఊహించని విధంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు పాటించాలని పలు రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి. తాజాగా మూడు రాష్ట్రాలు మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేశాయి. హర్యానా, కేరళ, పుదుచ్చేరిలో బహరింగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించాయి.
కాగా, కరోనా నాలుగో వేవ్‌పై కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తున్నది. సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహింనుంది. తద్వారా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో కరోనా సన్నద్ధతను పరిశీలించనున్నారు. కాగా, కోవిడ్ మ్యూటేషన్ ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ అయిన బీఎఫ్.7, ప్రస్తుతం ఎక్స్‌బీబీ1.16 సబ్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ సబ్‌వేరియంట్లతో పెద్దగా ప్రమాదం లేకపోయినా కేసులు వేగంగా పెరగడానికి దోహదపడుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు.