సౌత్ ఇండియాలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో సూర్య నటిస్తున్న కంగువ ఒకటి. శివ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కానున్నట్లు మేకరస్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వాస్తవానికి ఈ డేట్ లో ఎన్టీఆర్ దేవర రిలీజ్ కావాలి.
కానీ ఓజీ పోస్ట్ పోన్ అవడంతో దేవర రిలీజ్ ను ప్రీ పోన్ చేసి సెప్టెంబర్ 27కి ఫిక్స్ చేశారు. దీంతో దేవర స్లాట్ ఖాళీ అయిపోయింది. అయితే అదే అక్టోబర్ 10న రజినీకాంత్ వెట్టయాన్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయలేదు కానీ అక్టోబర్ నెలలోనే రిలీజ్ ఉంటుందని మేకర్స్ గతంలో చెప్పారు.
అదే డేట్ పై దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ కన్ను కూడా ఉంది. మిస్టర్ బచ్చన్ ను కూడా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని రవితేజ చూస్తున్నాడట. ఈ నేపథ్యంలో కంగువ టీమ్ అందరికంటే కాస్త ముందుగా అక్టోబర్ 10ని లాక్ చేసుకుని పోటీలో ముందు నిలిచింది. కంగువ నిర్మాణ భాగస్వామ్యంలో యువి సంస్థ ఉండటంతో తెలుగు వెర్షన్ కు కూడా భారీ రిలీజ్ దక్కనుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా మీద అందరికీ భారీ అంచనాలున్నాయి. సూర్య ఈ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే.