అనేక నాటకీయ పరిణామాల మధ్య నేపాల్ ప్రధానిగా సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ పార్టీ చైర్మన్ పుష్ప కమల్ ప్రచండ ప్రధానిగా నియమితులయ్యారు. కేపీ శర్మ ఓలితో పాటు అనేక చిన్న పార్టీలు ప్రచండకే జై కొట్టారు. దీంతో తమకు 165 మంది సభ్యుల మద్దుత వుందని నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారిని ప్రచండ కలుసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అందుకు అనుమతి కావాలంటూ కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రచండను ప్రధానిగా నియమిస్తూ. అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఆదేశాలిచ్చారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రచండకు మొత్తం 275 సభ్యుల్లో 165 మంది చట్ట సభ్యుల మద్దతు లభించింది. అందులో సీపీఎన్ యూఎంఎల్ 78, సీపీఎన్ ఎంసీ 32, ఆర్ఎస్ పీ 20, ఆర్ పీపీ 14, జేఎస్ పీ 12, నాగరిక్ ఉన్ముక్తి పార్టీ కి చెందిన ముగ్గురు సభ్యులున్నారు.