నేడే సైన్యంలో చేరనున్న కంబాట్ హెలికాప్టర్లు

భారత వాయుసేన సత్తా మరింత పెరుగనుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎగురగల తేలికపాటి హెలికాప్టర్లు నేడు జోధ్ పూర్ వేదికగా ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌లో చేరనున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేసిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరిలు నేడు లాంఛనంగా వాయుసేనలో ప్రవేశపెట్టనున్నారు. ఈ హెలికాప్టర్లతో ఎయిర్ ఫోర్స్ పోరాట పటిమ గణనీయంగా పెరుగుతుందని రాజ్ నాథ్ సింగ్ ఆదివారం ట్వీట్ చేశారు.

 

ఎయిర్ ఫోర్స్ కోసం 10, ఆర్మీ కోసం 5 ఎల్ సీహెచ్ లను సమకూర్చుకునేందుకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ గత మార్చిలో ఆమోదం తెలిపింది. సముద్రంలో, నేలపై, అడవుల్లో, హిమాలయాల వంటి ఎత్తైన ప్రాంతాల్లో, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సమర్థంగా ఎగిరేలా తయారు చేసిన ఎల్ సీహెచ్​లు.. అటు పాక్, ఇటు చైనా సైన్యానికి వణుకు పుట్టిస్తాయని చెప్తున్నారు. కేవలం 5.8 టన్నుల బరువుఉండే ఎల్ సీహెచ్​లలో 24 చిన్న మిసైళ్లు, ఇతర వెపన్స్ ఉంటాయి. శత్రు రాడార్లు, మిసైళ్లు, జెట్​లకు చిక్కకుండా తప్పించుకుంటూ వాటిపై దాడి చేసే సత్తా కూడా వీటికి వుంది.

 

Related Posts

Latest News Updates