పాక్ లో సంచలనం జరిగింది. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ లో ర్యాలీ సందర్భంగా ఆయనపై కాల్పులు జరిగాయి. దీంతో ఆయనతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఇమ్రాన్ కాలికి తీవ్రంగా గాయమైంది. కాల్పులు జరగగానే ఆయన్ను బుల్లెట్ ప్రూఫ్ కంటైనర్ లోకి మార్చేశారు. చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఇక… కాల్పులు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పాక్ మీడియా పేర్కొంది.
