“ఇక్షు” సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్

పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో వస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం  మెదటి షెడ్యూల్ అప్ డేట్స్ .. దర్శకురాలు వివి ఋషిక డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు నిర్మించిన చిత్రం “ఇక్షు”. ఈ సినిమా విడుదలైన థియేటర్స్ లలో  ఇంకా విజయవంతంగా  ప్రదర్శింపబడుతుంది. ఈ సినిమా తర్వాత ఇదే బ్యానర్ లో  ప్రొడక్షన్ నెంబర్ 2 లో మరో సినిమా మొదటి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సందర్బంగా చిత్ర దర్శకురాలు వివి ఋషిక మాట్లాడుతూ…ఇక్షు మూవీ అనేది నా కళ. సిద్ధం మనోహర్ ఇచ్చిన  కథను పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో దర్శకత్వం వహించి  ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు  తీసుకువచ్చిన మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఈ సినిమాలో నా కొడుకు రామ్ అగ్నివేష్ ను ఆర్టిస్ట్ గా చూస్తూ డైరెక్షన్  చేయడం చాలా సంతోషంగా  ఉంది. చాలా మంది నాకు ఫోన్స్ చేసి రామ్ చాలా బాగా చేశాడు అంటుంటే  ఆర్టిస్ట్ గా కూడా రామ్ ప్రూవ్ చేసుకొన్నాడనిపించింది. మా సినిమా ఇంకా కొన్ని థియేటర్స్ లలో విజయవంతంగా  ప్రదర్శింప బడుతున్న ఆనందంతో మేము ఈ రోజు సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపు కుంటున్నాము. నాకు సపోర్ట్ గా నిలిచిన నా భర్త  నిర్మాత హన్మంత్ రావు నాయుడు గారికి కూడా నా ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రానికి  రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి వంటి తదితర నటీనటులు, టెక్నిషియన్స్ సపోర్ట్ గా నిలవడంతో సినిమా బాగా వచ్చింది . అలాగే మేము  అడిగిన వెంటనే థియేటర్స్ ఇచ్చిన  డిస్ట్రిబ్యూటర్స్ కు ధన్యవాదాలు. నా మొదటి సినిమా “ఇక్షు” విజయవంత మైన కారణంగా ఇదే  బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2 గా మరో సినిమాను ప్రారంబించాము.  ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ కొరకు అడిషన్ ద్వారా సెలెక్ట్ చేశాము.ఇప్పుడు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది అని అన్నారు చిత్ర నిర్మాత హన్మంత్ రావు నాయుడు మాట్లాడుతూ.. పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో విడుదలైన ” ఇక్షు ” సినిమాకు సపోర్ట్ చేసిన దిల్ రాజు గారికి , బసిరెడ్డి గారికి, బేక్కం వేణుగోపాల్ గారికి దామోదర్ గారికి, ఈ చిత్రంలో  నటించిన రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను అందరికీ నా ధన్యవాదములు. ఇక్షు సినిమా మేము అనుకున్నంత రీచ్ అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది. పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో  సెట్స్ పైకి వెళ్లిన ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రాన్ని  కూడా ప్రేక్షకులకు నచ్చేవిధంగా తీస్తామని అన్నారు. హీరో రామ్ అగ్నివేష్ మాట్లాడుతూ..నన్ను గ్లామర్ గా చూయించమని మా అమ్మను అడిగితే లేదు నువ్వు ముందు ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవాలని అన్నారు.ఈ సినిమా కొరకు ఎంతో టఫ్ వర్క్ నేర్పించింది.ఇక్షు సినిమా లో నేను చెప్పిన యన్టీఆర్ డైలాగ్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఆ క్రెడిట్ రావడానికి కారణం మా అమ్మ, నాన్నలే. ఈసినిమా ద్వారా నేను సీనియర్ యాక్టర్స్ రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను ల ద్వారా ఆర్టిస్ట్  గా ఎన్నో మెలుకువలు  నేర్చుకున్నాను. నా నెక్స్ట్ సినిమాల ద్వారా విభిన్నమైన పాత్రలలో నటించి  ప్రేక్షకులను మెప్పిస్తాను. అలాగే పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో నాకు ఈ ఆఫర్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. నటీనటులు : రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి, తదితరులు సాంకేతిక. నిపుణులు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఋషిక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల, మూల కథ: సిద్ధం మనోహర్ కెమెరా : నవీన్ తొడిగి పాటలు:-కాసర్ల శ్యామ్ మ్యూజిక్: వికాస్ బాడిస ఎడిటింగ్: ఎస్ బీ ఉద్ధవ్ ఆర్ట్స్ : రాజు మాటలు: మున్నా ప్రవీణ్ కొరియోగ్రఫీ: భాను పి.ఆర్.ఓ : మధు వి. ఆర్

Related Posts

Latest News Updates