ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజాకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖ గర్జన సందర్భంగా.. పవన్ కళ్యాన్ పెళ్లిళ్లపై రోజా సెటైర్లు వేశారు. అయితే..రోజా కామెంట్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. నేను 3 సార్లు పెళ్లి చేసుకుంటే..3 చోట్ల రాజధానులు పెడతారా అని నిలదీశారు. వాళ్లు కూడా 3 పెళ్లిళ్లు చేసుకుంటే.. నేను అడ్డుకుంటానా అని ప్రశ్నించారు. బాంబేలో షూటింగ్ చేస్తే.. అక్కడ రాజధాని పెడతారా అని ఆగ్రహించారు.