వీధుల్లో ఆ పని చేస్తే రూ.1లక్ష వరకు జరిమానా.. జైలు శిక్ష

యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా దేశ పౌరులు, నివాసితులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వీధుల్లో భిక్షాటన చేస్తే భారీ జరిమానా, జైలుకి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. 2021లో తీసుకొచ్చిన ఫెడరల్ డిక్రీ-లా నం.31లోని ఆర్టికల్ 475 ప్రకారం భిక్షాటన చేయడం నేరం అని పేర్కొంది. దీనికి గాను 5వేల దిర్హమ్స్ (రూ.1.12లక్షల) జరిమానా ఉంటుందని, అలాగే మూడు నెలలకు మించకుండా జైలు శిక్ష కూడా ఉంటదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఇక కింద పేర్కొన్న సందర్భాలలో భిక్షాటన చేసినట్లు నేరం రుజువైతే మరింత కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది. బిచ్చం ఎత్తుకునే వ్యక్తి శారీరక అంగవైకల్యం కలిగి ఉండకపోయినా, అతను/ఆమెకు స్పష్టమైన జీవన వనరు ఉంటే, అతను/ఆమె ఇతరులకు సేవ చేస్తున్నట్లు నటిస్తే, బిచ్చం ఎత్తుకునే అతను/ఆమె తన పట్ల జాలిపడేలా ఇతరులను ప్రభావితం చేయడానికి ఏదైనా ఇతర మోసపూరిత మార్గాలను అనుసరించిన సందర్భంలో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పుకొచ్చింది. సంబంధిత అధికారులు వెల్లడించారు.

Related Posts

Latest News Updates