‘యానిమల్’ మూవీ ప్రేక్ష‌కుల‌కు ఎలా నచ్చిందో అర్ధం కావడం లేదు

బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌టించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ యానిమ‌ల్. టాలీవుడ్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాపై తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సీనియర్ నటి.. బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ. https://cinemaabazar.com/

యానిమ‌ల్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత సక్సెస్ కావడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇలాంటి సినిమాలు సూప‌ర్ హిట్ అవుతున్నాయంటే ప్రజలు అసలు ఏం ఆలోచిస్తున్నారు.. ఏం కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. ‘యానిమల్’ లాంటి సినిమాలను మళ్లీ మళ్లీ చూడటానికి జ‌నాలు ఇష్టపడుతున్నారు. ఈ ర‌కం సినిమాలు న‌చ్చుతున్న‌యంటే.. అలాంటి చిత్రాలను చూసే వ్యక్తుల ఆలోచనా విధానం గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడదే పెద్ద సమస్య. ఎందుకంటే సినిమాల్లో చూపించేవే సమాజంలో జరుగుతున్నాయి అని ఖుష్బూ చెప్పుకోచ్చింది. కాగా ప్ర‌స్తుతం ఖుష్బూ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. https://cinemaabazar.com/

Related Posts

Latest News Updates