ఈజిప్టులోని షరామ్ఎల్ షేక్లో ఆదివారం నుంచి జరగనున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు లో హైదరాబాద్ విద్యార్థి అంకిత్ సుహా్సరావు పాల్గొననున్నాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎ్స)లో అంకిత్ చదువుతున్నాడు. పర్యావరణ సమస్యలు, పరిష్కారంపై తన ఆలోచనలను పంచుకోనున్నాడు. పర్యావరణంపై అవగాహన కోసం సెంటర్ ఫర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఆఫ్ కెనడా అనే సంస్థ ప్రారంభించిన ాడీకార్బోనైస్్ణ అనే ప్రోగ్రాంలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ సందర్భంగా అంకిత్ మాట్లాడుతూ ఇండియా సహా దాదాపు 70 దేశాల్లోని వివిధ పాఠశాలల్లో ఈ ప్రోగ్రామ్ను అమలు చేస్తున్నారు. ాపర్యావరణ పరిరక్షణపై చాలా ఏళ్లుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా స్కూల్లో, సిటీలో పచ్చదనం కోసం కృషి చేస్తున్నాం. డీకార్బోనైస్ ద్వారా వివిధ దేశాల్లోని పర్యావరణ పరిరక్షణ విధానాలను నేర్చుకొన్నాం. నా ఆలోచనలపై సదస్సులో వైట్ పేపర్ సమర్పిస్తాను్ణ అని తెలిపారు. పర్యావరణ శాస్త్రవేత్త కావాలన్నదే తన ఆశయమన్నాడు.