హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ ఎల్బీనగర్, ఎల్బీనగర్ మియాపూర్ మార్గాల్లో 30 నిమిషాల పాటు మెట్రో సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్లే రైళ్లు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సేవలకు అంతరాయం కలగడంతో వివిధ స్టేషన్లలో రైళ్లను అధికారులు నిలిపేశారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, అమీర్ పేట్ స్టేషన్లలో రైళ్లు ఆగిపోయాయి. రైళ్లు ఆగిపోవడంతో కొందరు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపట్లో సేవలను పునరుద్దరిస్తామని సిబ్బంది అనౌన్స్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అరగంటకు పైగా నిలిచిపోయిన మెట్రో రైలు సేవలు.. పునరుద్దరణ చర్యలు చేపట్టడంతో రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.