సికింద్రాబాద్ రూబీ లాడ్జి అగ్ని ప్రమాద ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. పొగపీల్చి ఊపిరాడక ఆరుగురు చనిపోయారని ప్రకటించారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూటా? బైక్ కు పెట్టిన ఛార్జింగ్ వల్లా? అన్నది తెలుసుకోవాల్సి వుందని అన్నారు. హోటల్ లో వున్న 25 మందిలో ఎక్కువ మంతి నార్త్ ఇండియన్సే అని సీపీ తెలిపారు. వీరందరూ వ్యాపార విధుల నిమిత్తమే వచ్చినట్లు అనిపిస్తోందన్నారు. మెట్ల ద్వారానే పొగ లాడ్జి అంతా అలుముకుందని, బయటికి వచ్చి ఊపిరాడకే చనిపోయారని తెలిపారు. షోరూమ్ లో ఊపిరాడక ఆరుగురు చనిపోయారని తెలిపారు. స్థానికులు, పోలీసులు ధైర్యం చేసి వారిని కాపాడారని, అంతలోనే ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని, రక్షించారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.