దేవర రెండో సాంగ్ ఎలా ఉంటుందంటే?

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. మే 19న ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఒక రోజు ముందుగానే ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వ‌నుంది చిత్ర యూనిట్. మొద‌టి పాట‌గా ఫియ‌ర్ అనే పాట‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే దానికి సంబంధించిన ప్రోమో రిలీజై నెట్టింట వైర‌ల్ అవుతుంది.

అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో దేవ‌ర సాంగ్స్ కు సంబంధించి లిరిక్ రైట‌ర్ రామ‌జోగ‌య్య శాస్త్రి ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. మ‌రొక్క రోజు వెయిట్ చేయమ‌ని, అనిరుధ్, అబ్బా వ‌ర్తు వెయిటింగ్ అని అంద‌రితో అనిపిస్తాడ‌ని చెప్పిన శాస్త్రి, సెకండ్ సాంగ్ కోసం చెన్నై వెళ్లిన‌ట్లు చెప్పాడు.

దేవ‌ర సెకండ్ సాంగ్ మ‌రో ర‌కమైన ప్ర‌కంప‌న‌మ‌ని, ఫ‌స్ట్ సాంగ్ కోత అయితే సెకండ్ సాంగ్ లేత అని ఇన్‌డైరెక్ట్‌గా సెకండ్ సాంగ్ ఎలా ఉండ‌బోతుంద‌నే క్లారిటీ ఇచ్చేశాడు. శాస్త్రి చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తే ఫ‌స్ట్ సాంగ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండ‌బోతుంద‌ని, సెకండ్ సాంగ్ డ్యాన్స్ నెంబ‌ర్ అని అర్థ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే రెండో పాటగా తార‌క్, జాన్వీ మీద షూట్ చేసిన రొమాంటిక్ సాంగ్ రిలీజ్ కానుంద‌ని లీకులొచ్చాయి. మొత్తానికి అంద‌రూ దేవ‌ర సాంగ్స్ పై హైప్ ను బాగానే క్రియేట్ చేస్తున్నారు.  

Related Posts

Latest News Updates