దేశ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్.. స్వయంగా పర్యవేక్షించిన మన్సుఖ్ మాండవీయ

అంతర్జాతీయంగా కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. తాజాగా… దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ ను ఎదుర్కోడానికి సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో జరుగుతున్న మాక్ డ్రిల్స్ ను స్వయంగా పర్యవేక్షించారు. అలాగే రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు తమ దగ్గర ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, ఐసోలేషన్ పడకల సామర్థ్యం, ఐసీయూ, వెంటిలేటర్ పడకల లభ్యతను సమీక్షిస్తున్నారు.

 

ఈ సందర్భంగా మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ… కోవిడ్ సన్నద్ధతను తెలుసుకోవడానికే ఈ డ్రిల్ అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ కూడా సూచించారని వెల్లడించారు. అయితే.. ప్రస్తుతం విషమ పరిస్థితులు లేవని, అయినా… ఒకవేళ హఠాత్తుగా ఇబ్బందులు వస్తే.. వాటిని ఎదుర్కోడానికి కూడా తాము సిద్ధంగానే వున్నామని, అందుకే ఈ మాక్ డ్రిల్స్ అని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరగుతున్నాయని, అవి భారత్ లో కూడా వెలుగు చూస్తున్నాయన్నారు. అందుకే కోవిడ్ సదుపాయాల కార్యాచరణను సంసిద్ధత స్థితిలో వుంచడం చాలా ముఖ్యమని, అందుకు మాక్ డ్రిల్ దోహదపడుతుందని మన్సుఖ్ మాండవీయ వివరించారు.

Related Posts

Latest News Updates