విభజన సమస్యలపై చర్చించేందుకు మరోసారి ఈ నెల 23 న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర హోంశాఖ ఏపీ, తెలంగాణ అధికారులకు సమాచారం అందించారు. 23వ తేదీన జరిగే సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని ఇరు రాష్ట్రాలను కోరింది. వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, లోటు భర్తీ, అమరావతికి నిధులు తదితర అంశాలను సమావేశ ఎజెండాలో చేర్చింది కేంద్ర హోంశాఖ. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో వివిధ కేంద్ర శాఖల కార్యదర్శులు కూడా పాల్గొననున్నారు.
చివరగా సెప్టెంబరు 27న జరిగిన సమావేశ ఎజెండాలో మొత్తం 14 అంశాలు ఉండగా, ఏడింటిపై చర్చించారు. ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన, చట్టంలో లేని ఇతర సంస్థల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనపై చర్చ జరిగింది.