హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. నవంబర్ 12 న ఏకబిగిన ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఇక ఫలితాలను డిసెంబర్ 8 న ప్రకటిస్తామని పేర్కొంది. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కరోనా అదుపులోనే వుందని , అయినా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఆయన కోరారు. ఓటర్లను ప్రలోభపెడితే, చూస్తూ ఊరుకోమని, కఠినంగా వ్యవహరిస్తామని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఎయిర్ పోర్టులలో కట్టుదిట్టమైన నిఘా వుంచుతామన్నారు.
హిమాచల్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో పూర్తికానుంది. ప్రస్తుతం హిమాచల్లో అధికార ఎన్డీఏకు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హిమాచల్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 55,07,261 కాగా.. అందులో పురుషులు 27,80,208, మహిళలు 27,27,016 మంది ఉన్నారు. 1,86,681మంది ఓటర్లు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హిమాచల్ లో 80 ఏండ్లకుపైగా వయసున్న ఓటర్లు 1,22,087 కాగా.. 100 ఏండ్లు దాటిన ఓటర్లు 1,184 మంది ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే…
నోటిఫికేషన్ అక్టోబర్ 17
నామినేషన్ల చివరి తేదీ… అక్టోబర్ 25
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 27
నామినేషన్ల ఉప సంహరణ : అక్టోబర్ 29
పోలింగ్ : నవంబర్ 12
ఫలితాలు :డిసెంబర్ 8