బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అంతేకాకుండా ఆయనపై వున్న పీడీ యాక్ట్ ను కూడా ఎత్తేసింది. జైలు నుంచి రిలీజ్ అయ్యే సందర్భంలో ఏలాంటి ర్యాలీలు చేయకూడదని స్పష్టం చేసింది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎలాంటి అభ్యంతరకర పోస్ట్‌లు, కామెంట్స్ చేయకూడదని ఆదేశించింది. దాదాపు 3 నెలల వరకూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయవద్దని ఆదేశించింది. రాజాసింగ్ ను తక్షణమే విడుదల చేయాల్సిందిగా పోలీస్ శాఖకు హైకోర్టు ఆదేశాలిచ్చింది.