సినీ నటుడు శరత్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలొచ్చాయి. డయేరియా, డీహైడ్రేషన్ తో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై రకరకాల వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. దీంతో అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వదంతులు మరీ ఎక్కువ కావడంతో శరత్ కుమార్ పీఆర్ సభ్యులు స్పందించారు. అసలు ఏం జరిగిందన్న దానిపై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. చిన్నపాటి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారని, ఎవ్వరూ ఆందోళన చెందొద్దని, పుకార్లను స్రుష్టించొద్దని తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారని, సోషల్ మీడియా వదంతులను మాత్రం అస్సలు నమ్మొద్దని పీఆర్ టీం కోరింది.












