కొత్త సినిమా కోసం స్టైలిష్ మేకోవర్ లోకి మారిపోయిన హీరో కిరణ్ అబ్బవరం

ఈ దీపావళికి “క” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. పీరియాడిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు మలయాళంలోనూ మంచి వసూళ్లు సాధించింది. “క” సినిమా ఘనవిజయం ఇచ్చిన ఉత్సాహంలో ఆయన తన కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు.

“కేఏ 10” వర్కింగ్ టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు. కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా కోసం స్టైలిష్ మేకోవర్ లోకి మారిపోయారు. ఆయన కొత్త లుక్స్ తో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రిమ్ కట్ హెయిర్ తో కళ్లద్దాలు పెట్టుకున్న కిరణ్ అబ్బవరం కొత్తగా కనిపిస్తున్నారు.

Related Posts

Latest News Updates