హైదరాబాద్ లోని కూకట్ పల్లి సినిమా థియేటర్ లో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. వీరసింహా రెడ్డి సినిమా ఉదయం ఆటతో రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా కూకట్ పల్లిలోని భ్రమరాంబ థిచయేటర్ లో బెనిఫిట్ షో వేశారు. ఈ సందర్బంగా బాలయ్య ప్రేక్షకులతో కలిసి, సినిమాను వీక్షించారు. బాలయ్య రాకతో ఫ్యాన్స్ హంగామా చేశారు. థియేటర్ మొత్తం అభిమానులతోనే నిండిపోయింది. డప్పులతో బాలయ్యకు ఫ్యాన్స్ ఘనంగా స్వాగతం పలికారు. ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడం సంతోషంగా ఉందని, వారి స్పందన బాగుందని బాలకృష్ణ చెప్పారు.సంక్రాంతి స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా నేడు వీరసింహా రెడ్డి సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది.












