చెన్నైలో ఆగని వర్షం… రెడ్ అలర్ట్ జారీ.. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి

తమిళనాడులో వర్షాలు ఇంకా కురుస్తూనే వున్నాయి. గత వారం రోజులుగా చెన్నైతో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైతో సహా చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, నాగపట్నం, తంజావూరు, తిరువల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే వున్నాయి. దీంతో కాలనీలన్నీ జలమయం అయ్యాయి. అయితే.. చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, తంజావూరు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.

 

ఇక.. చెన్నై, తిరువళ్లూరు., కాంచీపురం లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. గత 30 సంవత్సరాలలో ఇంత వర్షాలు పడటం ఇదే మొదటిసారి అని అధికారులు ప్రకటించారు. మరో 3 రోజుల పాటు వర్షాలు ఇలాగే వుంటాయని అధికారులు ప్రకటించారు.

Related Posts

Latest News Updates