చెన్నైతో సహా మరో 8 జిల్లాల్లో భారీ వర్షాలు… అస్తవ్యస్తమైన జన జీవనం

నైరుతి బంగాళాఖాతం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో చెన్నై, శివారు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరంతో పాటు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా జనజీవనం స్తంభించింది. చెన్నై, కాంచీపురం, చెంగల్ పట్టు, తిరువళ్లూరు లో భారీగా వర్షాలు పడ్డాయి. ఈ వర్షానికి నగరంలో పలు చోట్ల చెట్లు కూలిపడటంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సోమవారం సాయంత్రం చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం రాత్రి 8 గంటలకు ఉధృతమైంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురింది.

 

సుమారు రెండు గంటలపాటు వర్షం కురవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చేపాక్‌, ట్రిప్లికేన్‌, రాయపేట, మందవెల్లి, రాజా అన్నామలైపురం, సైదాపేట, వేప్పేరి, ఫ్లవర్‌బజార్‌, పులియంతోపు, జిల్లాలలో కూడా వర్షాలు పడుతున్నాయి. దీంతో స్థానికంగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. చెన్నైలోని సుంగంబాక్కంలో 80.4 మి.మీ. వర్షం కురిసిందని, ఇది 72 సంవత్సరాలలో కురిసిన మూడో అత్యధిక వర్షమని చెన్నై అధికారులు పేర్కొన్నారు.

 

రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు కుండపోతగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తాయన్నారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, తిరువణ్నామలై జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయన్నారు. నీలగిరి, కడలూరు, మైలాడుదురై, రాణిపేట, వేలూరు, తిరుపత్తూరు, కరూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీగా వర్షాలు కురుస్తాయన్నారు.

Related Posts

Latest News Updates