విషమించిన ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం.. ఐసీయూలో చికిత్స..

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. అనారోగ్యం బారిన పడిన ఆయనను కొన్ని రోజుల క్రితం గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఆదివారం నాడు ములాయం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఐసీయూ వార్డుకు తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి . ప్రముఖ వైద్య నిపుణులు సుషీలా కటారియా ములాయం సింగ్ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అఖిలేష్ యాదవ్‌కు సమాచారం అందడంతో హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరి వెళ్లినట్టు తెలిసింది. ములాయం సింగ్ యాదవ్ వయసు 82 సంవత్సరాలు. మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశ రక్షణ శాఖా మంత్రిగా కూడా సేవలందించారు. కొన్ని వారాలుగా ములాయం సింగ్ యాదవ్ గురుగ్రామ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యవహారాలను చూసుకుంటున్నారు.

Related Posts

Latest News Updates