జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించాం… అయితే.. HCA వివరణ

కొన్ని రోజుల క్రిందటే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి RRR టీం సభ్యులు హజరయ్యారు. అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. అయితే.. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కనిపించలేదు. తారక్ ను పిలవలేదా? అని సంస్థను ప్రశ్నించడం మొదలు పెట్టారు. తారక్ అభిమానులు, నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ ప్రశ్నలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. జూనియర్ ఎన్టీఆర్ ను తాము ఆహ్వానించామని, కానీ.. అతను ఓ షూటింగ్ లో బిజీగా వుండిపోయాడని సంస్థ తెలిపింది. అందుకే రాలేకపోయారని పేర్కొంది. తాము వెళ్లి, అతి తొందర్లనే జూనియర్ కి అవార్డును అందజేస్తామని సంస్థ తెలిపింది.

అయితే… HCA రిప్లైకి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్ షూటింగ్ లో బిజీగా లేరు.. ఆయన సోదరుడు చనిపోయి, పర్సనల్ లాస్ లో వున్నాడు. అందుకే రాలేదు అంటూ స్పందించాడు. దీనికి మళ్లీ HCA స్పందించింది. ఎన్టీఆర్ తన సినిమా పనుల్లో వుండే అవార్డ్ ఫంక్షన్ కి రాలేదు. ఆ తర్వాతే తన బ్రదర్ చనిపోయాడు. అందుకే షూటింగ్ కి వెళ్లలేదు. ఈ విషయం మాకు చెప్పారు. అంటూ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

Related Posts

Latest News Updates