అందుకే ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ అనేది… హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్

వర్క్ ఫ్రం హోమ్, వర్క్ ఫ్రం ఆఫీస్ గురించి వివరిస్తూ పారిశ్రామిక వేత్త హర్ష గోయంకా చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ లో వర్క్ం ఫ్రం హోం వల్ల కలిగే లాభాలు, వర్క్ ఫ్రం ఆఫీస్ వల్ల కలిగే లాభాలు ఛార్ట్ రూపంలో వేసి వుంది. టీ, లంచ్ బ్రేక్ తీసుకోవం, ట్రాఫిక్ లో వుండటం. మన పని మనం చేసుకోవడంతో పాటు ఇతరులకు కూడా సహాయపడటం వంటివి వర్క్ ఫ్రం ఆఫీసులో వుంటాయి. అందుకే మీరు ఆఫీస్ నుంచే పనిచేయాలని అనేది ఇందుకే.. ఇదే కారణం అంటూ హర్ష గోయెంకా రాసుకొచ్చారు. అయితే.. దీనిపై నెటిజన్లు తమ తమ అనుభవాలను కూడా తెలుపుతున్నారు.

కరోనా నుంచి వర్క్ ఫ్రం హోం ఉద్యోగులందరికీ అలవాటైంది. దీంతో ఉద్యోగులు దీనికే బాగా అలవాటు పడ్డారు. ఆయా కంపెనీలు ఆఫీసుకే వచ్చి పనిచేయాలన్నా.. ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రం హోమ్ కే బాగా అలవాటు పడ్డారు. అయితే.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఆఫీసుకే వచ్చి విధులు నిర్వర్తించాలని ఎక్కువ కంపెనీలు కోరుతున్నాయి.

Related Posts

Latest News Updates