పంట పెట్టుబడి సాయం కింద పదో విడత రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో జమచేసింది తెలంగాణ ప్రభుత్వం.  యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు జమచేశామని మంత్రి హరీశ్‌ రావు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తొలిరోజు 21 వేల మందికిపైగా రైతుల ఖాతాల్లో రూ.607 కోట్లు జమయ్యాయని ట్వీట్‌ చేశారు. ‘యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. పదో విడుత రైతుబంధు ద్వారా 70.54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. తొలిరోజున 1 ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతులకు ఇప్పటికే వారి అకౌంట్లలో రూ.607.32 కోట్లు జమ చేయబడ్డాయి’ అని మంత్రి హరీశ్‌ రావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.