తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో దశ ఖమ్మం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని ప్రకటించారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సు లో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కంటి సమస్యతో ఎవరు బాధపడవద్దని రెండవ దశ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిపారు.
జనవరి 18 నుంచి జూన్ 30వరకు జరిగే రెండవ దశ కంటి వెలుగు లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. తొమ్మిది నుంచి సాయంత్రం 4గంటల వరకు సోమవారం నుంచి శుక్రవారం కంటి పరీక్ష చేస్తారని మంత్రి చెప్పారు. జిల్లాకు అదనంగా 35మంది వైద్యులను రిక్రూట్ చేశామని పేర్కొన్నారు.ఉదయం ఇప్పటికే 10లక్షల కళ్ల అద్దాలు ప్రతి జిల్లాకు చేరుకున్నాయని వివరించారు. రెండో దశ కంటి వెలుగుకు రూ. 250కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. జిల్లాలో 45 వైద్య బృందాలు, మరో మూడు అదనపు బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు.